Monday, December 17, 2018

వినయ విధేయ రామలోని లిరికల్ వీడియో సాంగ్ !!!

రంగ స్థలం తరువాత రాంచరణ్ నటిస్తున్న బోయపాటి డైరెక్షన్ లో వస్తున్న వినయ విధేయ రామ లోని లిరికల్ వీడియో సాంగ్ విడుదల చేసారు !!!

స్మార్ట్ ఫోన్ లేకుండా ఉండలేమా?


బయటకు వెళ్లాలంటే పర్సు లేక పోయినా పర్వాలేదు గాని ఫోన్ లేకపోతే వెళ్లలేము అంతగా ముడిపడి పోయింది మన జీవితాలకు ఈ ఫోన్
ఫోన్ అంటే కేవలం మనకు దూరంగా ఉండే వారితో మాట్లాడటానికి ఉపయోగించేవారు కానీ నేడు ఫోన్ లేకపోతే ఆ ఊహే ఉహించుకోలేము అది స్మార్ట్ కు అలవాటు పడ్డవారు ఒక్క గంట కాదు ఒక 15 నిమిషాలు కూడా ఉండలేరు

Telugu quotes for WhatsApp status !!!


Sunday, December 16, 2018

అడవి శేష్ గూఢచారి 2 ఎప్పుడంటే ?

మన తెలుగు సినిమాలలో కొన్ని సినిమాలు హాలీవుడ్ దీటుగా అదే సమయంలో మన ప్రేక్షకులకు అర్థం అయ్యేలా కొన్ని చిత్రాలు అప్పుడప్పుడు వస్తుంటాయి
 
 అలాంటి చిత్రాలలో ఈ మధ్య కాలంలో తక్కువ బడ్జెట్లో తీసిన చిత్రాలలో గూఢచారి ఒకటి దీనికి సీక్వెల్ గా గూఢచారి 2 అడవిశేష్ హీరోగా 2020 లో రాబోతుంది దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు !!!

Saturday, December 15, 2018

శర్వానంద్ "పడి పడి లేచే మనసు"తో హిట్ కొడతాడా?

మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు లాంటి మంచి ప్రేమ కధ తో మంచి విజయాన్ని అందుకున్నారు శర్వానంద్ ఆ తరువాత మెర్లపాక గాంధీ డైరెక్షన్ లో కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చి మరలా మంచి హిట్ అందుకున్నాడు ఆ తరువాత వచ్చిన సినిమాలు కొద్దిగా నిరాశ పరిచాయి
కొద్దీ గ్యాప్ తరువాత హను రాఘవపూడి డైరెక్షన్ లో వస్తున్న పడి పడి లేచే మనసు సినిమా తో మన ముందుకు వస్తున్నారు
ట్రైలర్ ఈ మధ్యనే విడుదల చేసారు !!!

Thursday, December 13, 2018

అఖిల్ 3వ చిత్రంతో నైనా మురిపించేనా?

అభినయానికి అందంతో పాటు అదృష్టం కూడా ఉండాలి అక్కినేని అఖిల్ తన రెండు చిత్రాలు పరాజయాలు తరువాత వరుణ్ తేజ్ తొలిప్రేమ డైరెక్టర్ వెంకీ అట్లూరి డైరెక్షన్ లో వస్తున్న మిస్టర్ మజ్ను చిత్రం జనవరి బరిలో విడుదల అవ్వటానికి సిద్ధం అవుతుంది
తాజాగా తమన్ స్వర పరిచిన పాట విడుదల  చేసారు అయితే ఆ పాట వినటానికి తొలి ప్రేమ పాట లాగే అనిపించింది !!!

Wednesday, December 12, 2018

సంక్రాంతి ఫ్యామిలీ ఎంటర్టైనర్ F2 కానుందా? F2 టీజర్

సంక్రాంతి అంటేనే సరదా, సంబరం సంబరానిక కుటుంబం సరదా కు సినిమా వచ్చే సంక్రాంతి బరిలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ నటించిన fun& frustration F2 అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వస్తున్న F2 టీజర్ పై ఒక లుక్ వేయండి !!!

Tuesday, December 11, 2018

నందమూరి అభిమానుల ఆగ్రహం వరుణ్ తేజ్ "అంతరిక్షాన్ని" తాకానుందా?

ఆడియో ఫంక్షన్లలో,సినిమా ప్రమోషన్ లలో భాగంగా స్టార్ హీరోలు మాలో మేము బాగానే ఉంటాము అభిమానులు మాత్రం ఒకరిని ఒకరు దూషించుకుంటూ ఉంటారు అని చెబుతారు అయితే ఈ మధ్య నందమూరి బాలకృష్ణ గారి నోటి ద్వారా పవన్ కల్యాణ్ ఎవరో నాకు తెలియదు అన్నారు
 అయితే దానికి సమాధానంగా నాగబాబు గారు బాలకృష్ణ ఎవరో నాకు తెలియదు అని కౌంటర్ ఇచ్చారు దీనిపై నందమూరి, మెగా అభిమానుల మధ్య సోషల్ మీడియా వేదికగా రచ్చ జరుగుతుంది
ఇదిలా ఉంటే నందమూరి అభిమానుల ఆగ్రహం నాగబాబు మీద నుండి ఆయన తనయుడు నటించిన అంతరిక్షం సినిమాపై చూపిస్తామని అంటున్నారు !!!

Monday, December 10, 2018

తెలంగాణా ఎన్నికల ఫలితాల టెన్షన్ ?

2014 వ సంవత్సరంలో రాష్ట్రం విడిపోయిన తరువాత మొదటి సారి సర్కార్ నెలకొల్పింది T. R. S ఎన్నికలు ఇంకా 6 నెలలు ఉండగానే ముందస్తు రాజీనామా చేసి అందర్నీ షాక్ కి గురి చేశారు కె.సి.అర్
అయితే ఈ సారి కూడా తెలంగాణలో సర్కార్ నెలకొల్పేది T.R.S అని exit పోల్స్ తేల్చింది లగడపాటి సర్వేలో మాత్రం మహాకూటమి గెలుస్తుందని తెలుస్తుంది ఏ విషయం తెలియాలంటే ఈ రోజు వేచి చూడాల్సిందే
పందేలు మాత్రం జోరుగా సాగుతున్నాయి !!!

Telugu quotes for whatsapp status !!!




Saturday, December 8, 2018

అంతరిక్షం ట్రైలర్ చూసారా?

ఘాజి లాంటి ప్రయోగాత్మక చిత్రంతో తన ప్రతిభను చాటుకున్న సంకల్ప్ డైరెక్షన్ లో వరుణ్ తేజ్ నటించిన అంతరిక్షం ట్రైలర్ చూసారా ?

Thursday, December 6, 2018

సెంటిమెంట్+ఫామిలీ+ ఫైట్స్ = బోయపాటి శ్రీను

బోయపాటి తాను తీసే ప్రతి సినిమాలో ఖచ్చితంగా ఫ్యామిలీ, సెంటిమెంట్ అనే అంశాలు ఉండేటట్లు చూసుకుంటారు ఇక ఫైట్స్ గురించి చెప్పవలసిన అవసరం లేదు
సగటు మాస్ ప్రేక్షకులు కావాల్సింది ఫైట్స్, పంచ్ డైలాగ్స్ కు కొడవే ఉండదు విలన్ ఎంత బలంగా ఉంటే హీరోను అంత పవర్ ఫుల్ గా చూపించే డైరెక్టర్ లలో రాజమౌళి, తరువాత బోయపాటి
ఇక సెంటి మెంట్ గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు బోయపాటి సినిమాను మాస్ ప్రేక్షకులకు మాత్రమే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా నచ్చే విధంగా ఉంటుంది !!!

Telugu quote !!!


Wednesday, December 5, 2018

టెంపర్ సినిమా బాలీవుడ్ ట్రైలర్ చూసారా ?

యంగ్ టైగర్ N.T.R నటించిన టెంపర్ సినిమా బాలీవుడ్ లో రీమేక్ అవుతుంది ట్రైలర్ చూడండి !!!

Monday, December 3, 2018

రోబో 3.0 కూడా ఉండబోతుందా?

రోబో2.0 దాదాపు 600 కోట్ల బడ్జెట్ తో మన ఇండియా లోనే ఎక్కువ బడ్జెట్ తో తీసిన చిత్రం వసూళ్ల పరంగా ఏ విధంగా ఉన్న గ్రాఫిక్స్ తో తన ప్రతిభను ప్రపంచానికి మరియొక సారి చూపించాడు శంకర్
   అయితే రోబో లో ఉన్న కథ పరంగా చూసిన గ్రాఫిక్స్ పరంగా 2.0 ఖర్చుకు తగ్గట్టుగా మలిచారు శంకర్ భవిష్యత్ లో రోబో 3.0 సినిమా కూడా చేసే అవకాశం ఉన్నట్టు 2.0 లో చూపించారు శంకర్ రోబో క్లైమాక్స్ స్కీన్లో వచ్చే మరగుజ్జు రోబో లు వీటికి ఉదాహరణ!!!

Saturday, December 1, 2018

Telugu quote !!!


తమిళంలో శింబు నటించిన అత్తారింటికి దారేది టీజర్ చూసారా ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్  డైరెక్షన్ లో వచ్చిన అత్తారింటికి దారేది తమిళంలో రీమేక్ గా శింబు నటిస్తున్నారు ఈ సినిమా కు సంబంధించి టీజర్ ను ఇటీవల రిలీజ్ చేశారు

Friday, November 30, 2018

బ్లాగ్, యూట్యూబ్ మనలో ఉన్న ప్రతిభను ప్రపంచానికి తెలియచేసే సాధనాలు ?

ఒక్కప్పుడు మనలో ప్రతిభ ఉంటే అది ఇతరులకు తెలియటానిక చాలా సమయం పట్టేది కాని ఇప్పుడు టెక్నాలజీ ఎంతగానో అభివృద్ధి జరిగింది దానికి తోడు ఇంటర్నెట్ పై అవగాహన కూడా అందరికి ఉపయోగపడుతుంది

 బ్లాగ్ :  మనకు నచ్చింది మనం రోజూ ఆచరించేది మనకు తెలిసింది, మనలో ఉన్న భావాలు, అభిప్రాయాలు మన ఆలోచనలు, మన సలహాలు అన్ని బ్లాగ్ అనేది మన గురించి మనకు తెలియచేసేది

అంతే కాకుండా మనకు తెలిసిన విషయాలు అందరికి తెలిసేలా చెప్పేది బ్లాగ్ ఏ విద్య అయిన పంచుకుంటే పెరుగుతుంది 


యూట్యూబ్ : దీని గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు ఎందుకంటే మనం ఇంటర్నెట్ వాడకం ఈ రోజుల్లో బాగా ఎక్కువైంది ప్రతిరోజు ఖచ్చితంగా మనం వీడియోస్ చూస్తుంటాం మనలో ఉన్న ప్రతిభను చెప్పటం కంటే చూపించటం వల్ల ఎదుటివారికి తేలికగా అర్థం అవుతుంది మనలో ఉన్న నైపుణ్యం, ప్రతిభ ప్రపంచానికి చాలా త్వరగా చూపించేది యూట్యూబ్ !!!

Telugu quotes




శంకర్ అంటే social message ?

 ఈ విషయం శంకర్ మొదటి చిత్రం నుండి మనకు తెలుస్తుంది సినిమా అనేది వినోదానికి మాత్రమే కాదు ఆలోచింపచేసేదిలాగా ఉండాలని శంకర్ తీసిన ప్రతి సినిమా మనకు తెలుపుతుంది
 శంకర్ సినిమాలో ఎక్కువగా అవినీతి గురించి చెప్పటం జరుగుతుంది కానీ ఈ మధ్య కాలంలో వచ్చే శంకర్ సినిమాలు మానవుడు అభివృద్ధి అనుకుంటున్న విషయాలు ప్రకృతి ఏ విధంగా నాశనం అవుతుందో రోబో, రోబో2.ఓ సినిమా లో శంకర్ మనకు చూపించారు!!!

Wednesday, November 28, 2018

ఫోన్ నెంబర్ మారకుండానే వేరే నెట్వర్క్ లోకి (M.N.P) ఎలాగో తెలుసా ?

ఇప్పుడు ఏ నెట్వర్క్ చూసిన incoming కు out going కు ప్రతి నెల లేదా 3 నెలలకు ఒకసారి రీఛార్జి చేయించాలి అయితే మన నెంబర్ మారకుండానే వేరే నెట్వర్క్ లోకి మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ M.N.P ఎలాగా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం !
 
మీ మొబైల్ లో message ఓపెన్ చేసి create message లోకి వెళ్లి PORT అని capital letters టైప్ చేసి space ఇచ్చి 1900 నెంబర్ కు message పంపించండి 
ఇలా ఈ నెంబర్ కు message పంపిస్తే  మీకు ఒక కోడ్ వస్తుంది ఇది మీరు మారాలనుకుంటున్న నెట్వర్క్ ఆపరేటర్ ఆఫీస్ కి వెళ్తే వారు M.N.P ప్రాసెస్ చేస్తారు

దీనికి కనీసం ఒక వారం లేదా 5 రోజులు టైం పడుతుంది !!!

ఇక నుండి ప్రతి నెల రీఛార్జి పిడుగు పడుతుంది !!!

ఇప్పటిదాకా ఏ అవసరానికి, 30, 50 రీఛార్జి చేయించుకునేవారు కానీ ఇప్పుడు పరిస్థితి మారింది ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ప్రతినెలా రీఛార్జి చేసుకునేలా ఐడియా వొడాఫోన్, ఎయిర్టెల్ ఇప్పటికి తమ ఖాతా దారులకు message పంపిస్తున్నాయి
   ఇప్పటివరకు ఉన్న లైఫ్ టైం వాలిడిటీ ని రద్దు చేసి incoming,outgoing కొరకు రీఛార్జి చేసుకోవాల్సిందే ఇదంతా jio నెట్వర్క్ రావటం వల్ల వారి ఆదాయానికి భారీగా గండి పడింది
2010 -11 సంవత్సరంలో Tata DoCoMo రావటంతో కాల్ charges తగ్గాయి ఇప్పుడు jio రావటంతో నెట్ రేట్లు,ఫ్రీ కాల్స్ పరంపర మొదలైంది !!!

కస్టమర్ కేర్ నుండి వచ్చే కాల్స్, messages బ్లాక్ చేయటం తెలుసా మీకు?


మనం రోజువారీ చేసే పనిలో బిజీగా ఉన్నప్పుడు మనకు కస్టమర్ కేర్ నుండి కాల్స్ వచ్చి విసిగిస్తూ ఉంటాయి అలాగే message లు అనవసరమైన message లు వచ్చి ఫోన్ message inbox అంతా నిండి పోయి ఉంటుంది
ఇలాంటప్పుడు మనకు చాలా అసహనం కలుగుతుంది ఇలా అనవసరమైన కాల్స్ , message లను బ్లాక్ చేయటానికి ఒక పరిష్కారం ఉంది అదేంటో చూద్దాం
 మీ మొబైల్ message లోకి వెళ్లి create message లో START అని కాపిటల్ లెటర్స్ లో type చేసి space ఇచ్చి 0 (జీరో) అని టైప్ చేసి 1909 అనే నెంబర్ కు mesaage పంపండి ఇది పూర్తిగా ఉచితం
అలా పంపిన తరువాత మీకు కంపెనీ నుండి తిరిగి message వస్తుంది
అనవసరమైన కాల్స్, messages బ్లాక్ అవటానికి మీకు 7 రోజులు టైం పడుతుంది ఇలా పంపిన వెంటనే మీకు కాల్స్ బ్లాక్ అవ్వవు కనీసం 10 రోజులు టైం పడుతుంది
  ఆ తరువాత మీకు కస్టమర్ కేర్ నుండి ,message, కాల్స్ పూర్తిగా block అవుతాయి !!!

Facebook లో షేర్, like చేయటం వల్ల ఎవరికి మేలు కలుగుతుంది !!!


ఈ రోజుల్లో facebook , whatsapp అంటే తెలియని వారు చాలా తక్కువ మంది ఉంటారు ఒక విధంగా చెప్పాలంటే మీడియా కంటే ముందుగా సోషల్ మీడియా లొనే ఈ విషయం అయిన ముందుగా తెలుస్తుంది అనటంలో సందేహం లేదు
 అయితే ఫేస్బుక్ విషయానికి వస్తే చాలామంది కాలక్షేపానికి open చేస్తుంటారు అదే పనిగా చేస్తే అదే అలవాటుగా మారుతుంది కూడా ఫేస్బుక్ open చేయగానే ఒక రైతు ఫోటోనో, లేదా దేవుడి ఫోటో, లేదా ముసలి వారి ఫోటో పెట్టి నచ్చితే షేర్ చేయండి లేదా like చేయండి మీ విలువైన సలహాను కామెంట్ లో రాయండి అనేది మనం ప్రతి ఫేస్బుక్ లో చూస్తుంటాం
ఇలా చేయటం వల్ల ఆ పోస్ట్ పైన ఒక ఫేస్బుక్ పేజీ ఉంటుంది మీరు like, share, comment చేయటం వల్ల మీ ఫ్రెండ్స్ అందరికి అది ఫార్వార్డ్ అవుతుంది తద్వారా facebook, పేజీకి followers. పెరుగుతారు !!!

Monday, November 26, 2018

ఇప్పటి సినిమాలు యువత చూడటానికే ప్రాధాన్యం ఇస్తున్నాయా ?

ఒకప్పుడు సినిమాలు కుటంబ సమేతంగా చూసే విధంగా ఉండేవి కానీ నేడు ఆ పరిస్థితి ఎక్కడ కనిపించటం లేదు
ఈ మధ్య కాలంలో వచ్చే సినిమాలు యువతకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నాయి
   ఇదివరకు సినిమా అంటే వినోదం పంచేది కుటుంబం మొత్తం పండగకు సినిమాకు వెళ్లేవారు కానీ రాను రాను పరిస్థితులు మారాయి థియేటర్ టికెట్ ఛార్జిలు పెరిగాయి అది కాకుండా కుటుంబ సమేతంగా చూడవలసిన సినిమాలు కూడా అడపా, దడపా వస్తున్నాయి
   అందుకే దర్శకులు, నిర్మాతలు కూడా యువతకు నచ్చే అంశాలు ఎక్కువగా ఉన్న సినిమాలు పైనే మక్కువ చూపిస్తున్నారు !!!

Telugu best quotes




Sunday, November 25, 2018

ప్రయాణం (కథ)

ఉదయం 10 గంటలు అవుతుంది తన బైకుపై ఆఫీస్ కి వెళ్తున్నాడు నరేష్ ఇంతలో ఫోన్ మొగుతుంది కానీ ట్రాఫిక్ లో ఉండటం వల్ల ఫోన్ సౌండ్ వినిపించలేదు కాసేపటికి ఆఫీస్ కి చేరుకున్నాడు ఇంతలో మరొకసారి ఫోన్ వచ్చింది
ఫోన్ చేసింది నరేష్ వాళ్ళ నాన్న సుబ్బారావు ఆఫీస్ కి 3 రోజులు సెలవు తీసుకుని ఇంటికి రమ్మని చెప్పాడు నరేష్ ఎందుకు అని అడిగాడు
కుటుంబం అంతా తిరుపతికి వెళ్దాం అనుకున్నాను అది ఇప్పుడు కుదిరింది అని చెప్పాడు సరే మా manager దగ్గరికి వెళ్లి అడుగుతాను అని చెప్పి ఫోన్ పెట్టేసాడు
Manager దగ్గరకి వెళ్ళి సెలవు కోసం చెప్పాడు manager మొదట కుదరదు అన్నాడు కానీ ఎలాగోలా చివరికి ఒప్పుకున్నాడు
తన ఊరు వెళ్ళటానికి సిద్ధమయ్యాడు రాత్రి 8 గంటలు సమయం అవుతుంది బస్సు బయలుదేరటానికి సిద్ధంగా ఉంది అంతలో ఒక పెద్దాయన పరిగెత్తుకుంటూ వస్తున్నాడు అది చూసి ఒక అమ్మాయి బస్సు అపమని అరిచింది బస్సు ఆగింది ఇంతలో ఆ పెద్దాయన బస్సు ఎక్కాడు బస్సు బయలుదేరింది
కాసేపటికి బస్సులో అందరూ నిద్ర పోతున్నారు ఇంతలో ఒకసారి బస్సు కుదుపులకు గురి అయినట్టు అందరూ ఒక్కసారి నిద్ర లేచి చూసారు ఏమైంది అని అడిగారు డ్రైవర్ ని బస్సు టైర్ ఫంక్చర్ పడింది అని చెప్పాడు టైం పడతుంది అందరూ కిందికి దిగండి అని చెప్పి డ్రైవర్ టైర్ మారుస్తున్నాడు
అందరు కిందకి దిగారు ఆ అమ్మాయి కూడా కిందకి దిగింది ఒక్కసారిగా ఆ అమ్మాయి నరేష్ వైపు రావటం గమనించి ఒక్కసారిగా షాక్ అయ్యాడు
ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి కొంచెం భయం గానే ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి ఇంటికి కాల్ చేసి చెబుతాను అని చెప్పి ఫోన్ తీసుకుంది
నరేష్ ఫోన్ ఇచ్చాడు కాసేపు ఫోన్ మాట్లాడి మారాల తీసుకొచ్చి నరేష్ కి ఫోన్ ఇచ్చేసింది మీ పేరేమిటి అని అడిగాడు నరేష్
నా పేరు రాధ అని చెప్పి వెళ్ళిపోయింది ఏ ఊరు మీది అని అడిగాడు కానీ అటువైపు నుండి ఏ సమాధానం రాలేదు డ్రైవర్ అందరిని బస్సు ఎక్కమని చెప్పాడు అంటారు బస్సు ఎక్కారు నరేష్ ఆ అమ్మాయిని చూసాడు కానీ ఏమీ మాట్లాడలేదు
కాసేపటికి నరేష్ నిద్రలోకి జారుకున్నాడు ఉదయం 7 గంటలు అవుతుంది నరేష్ కొద్దీ సేపటికి తాను దిగవాల్సిన స్టాప్ వచ్చింది తను దిగుతున్నాడు ఒక్కసారి ఆ అమ్మాయి వైపు చూసాడు ఆ అమ్మాయి కూడా దిగుతోంది
నరేష్ బస్సు దిగగానే వల్ల తమ్ముడు ప్రతాప్ అక్కడకు బైకుపై వెంటనే బైకుపై తన ఇంటికి వెళ్ళాడు వెనుక రాధ వస్తుంది ప్రతాప్ ఎవరు ఆ అమ్మాయి మన ఊరు లో ఎప్పుడు చూడలేదు అని అడిగాడు దానికి ప్రతాప్ వాళ్ళ నాన్న గారు పోస్టుమాన్ కొత్తగా మన ఉరికి వచ్చారు అని చెప్పాడు అంతేకాదు వాళ్ళది మన ఇంటి పక్కనే అద్దెకు వుంటున్నారు అని చెప్పాడు
రేపు తిరుపతి కూడా వాళ్ళు కూడా వస్తున్నారు అని చెప్పాడు మాటల్లోనే ఇంటిని చేరుకున్నారు
ఆ మరుసటి రోజు ఉదయం 4 గంటలు అవుతుంది కుటుంబం అంతా బయలు దేరింది , వాళ్ళతో పాటు రాధ వాళ్ళ అమ్మగారు, రాధ తమ్ముడు , రాధ కూడా వస్తున్నారు వాళ్ళ నాన్న గారు రావటం లేదు
అందరూ రైల్వే స్టేషన్ కి చేరుకున్నారు అంతా బాగానే ఉంది
ఎలాగైనా రాధతో మాట్లాడాలని అనుకున్నాడు రైల్వే భోగి అంతా ఖాళీ గానే ఉంది ఒక విండో సీట్ దగ్గర కూర్చున్నాడు ఇంతలో రాధ అక్కడకు వచ్చింది
చూసి నవ్వుకున్నారు ఒకరికి ఒకరు
మీ పేరేమిటి అని అడిగింది రాధ నా పేరు నరేష్
మీరు ఏమి చేస్తారు అని అడిగింది నేను ఒక అకౌంట్ ఆఫీస్ లో పని చేస్తున్నాను అని చెప్పాడు
మీరు ఏమి చేస్తారు అని అడిగాడు నరేష్
నేను M. B. A పూర్తి అయింది అని చెప్పింది
అలా వారి మాటలుతో ఒకరికి ఒకరు పరిచయం ఏర్పడింది


Friday, November 23, 2018

మాటే వినదుగా వీడియో సాంగ్ (టాక్సీవాలా)

విజయ్ దేవరకొండ నటించిన టాక్సీవాలా చిత్రంలోని మాటవినదుగా వీడియో సాంగ్ మీకోసం !!!

Tuesday, November 20, 2018

ఎవరు (కథ )


ఉదయం సమయం 7 గంటలు అవుతుంది ఫోన్ మోగుతుంది కాసేపటికి ఫోన్ అందుకున్నాడు ప్రకాష్ రేపు మా ఇంటిలో ఫంక్షన్ ఉంది తన ఫ్రెండ్ సుందరం  రమ్మని వారం రోజులుగా చెబుతున్నాడు మరొకసారి గుర్తు చేద్దామని ఫోన్ చేసాడు సరే వస్తాను అని చెప్పాడు
    కొంచెం త్వరగా బయలుదేరి రా రాత్రి పూట ప్రయాణం మా ఊరిలోఎమి దొరకవు అని చెప్పాడు వెంటనే లేచి స్నానం చేసి తన షాప్ కి తాను వెళ్ళాడు ప్రకాష్ ఒక మొబైల్ షాప్ లో మెకానిక్ గా పని చేస్తున్నాడు సాయంత్రం 6 గంటలు అవుతుంది తన షాపులో పెర్మిషన్ తీసుకొని ఇంటికి వెళ్లి స్నానం చేసి బయలుదేరాడు
  తన ఫ్రెండ్ సుందరం ఇంటికి ఎప్పుడో ఒకసారి వెళ్ళాడు ప్రకాష్ వెళ్లి 5 సంవత్సరాలు పైనే అవుతుంది అది బాగా పల్లెటూరు సాయంత్రం 8 గంటలకి అందరూ పడుకుంటారు అంతా చీకటిగానే  ఉంది  మెల్లగా తన బైకుపై వెళ్తున్నాడు ఇంతలో ఎవరో  పిలిచినట్టు ఒక కేక వినిపించింది వెంటనే బైక్ అపి వెనకకు తిరిగి చూసాడు ఎవరు కనిపించలేదు మరలా బైక్ స్టార్ట్ చేసి ముందుకు వెళ్తున్నాడు
ఈ సారి తన బైక్ ఆగిపోయింది చుట్టూ చూసాడు కనీసం కనుచూపు మేరలో ఎవరు కనిపించలేదు వెంటనే తన ఫ్రెండ్ సుందరంకి ఫోన్ చేసాడు  చాలా సేపు కలవలేదు కాసేపటికి కలిసింది సరే ఇప్పుడు నువ్వు ఎక్కడఉన్నావు అని అడిగాడు సుందరం
నేను వేట్ల దాటిన తరువాత కొంచెం దూరం లో ఉన్నాను అని చెప్పాడు సరే నేను వస్తున్నాని ఫోన్ పెట్టేసాడు

కాసేపటికి అక్కడకి చేరుకున్నాడు కానీ అక్కడ ప్రకాష్ లేడు తన బైక్ మాత్రం ఉంది చుట్టూ చూసాడు ఎక్కడ కనిపించలేదు తన మొబైల్ కి ఫోన్ చేసాడు ఎక్కాడు దూరంగా చెట్టు పొదలలో వినబడుతుంది ఆ పక్కనే పది ఉన్నాడు ప్రకాష్
వెంటనే దగ్గరలోని హాస్పిటల్ కి తీసుకెళ్లాడు సుందరం కాసేపటికి మెలకువ లోకి వచ్చాడు ప్రకాష్
ఏమి జరిగింది అని అడిగాడు సుందరం
నేను నీకు ఫోన్ చేసిన తరువాత కొద్దీ సేపటికి ఎవరో కారు మీద వచ్చారు నేను ఆపడానికి ప్రయత్నించాను కానీ ఆ కారు ఆపలేదు కొంచెం దూరంలో ఆ కారు ఆగింది అంతలో నేను కారు దగ్గరికి వెళ్ళాను ఎవరినో బలవంతంగా తీసుకెళ్తున్నారు నేను వెంటనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను అంతలో ఎవరో నన్ను బలవంతంగా వెనుక నుండి కొట్టారు నేను స్పృహ తప్పి పడిపోయాను ఇది జరిగింది వెంటనే పోలీస్ లకి ఫోన్ చేసి జరిగింది అంతా చెప్పారు !!!

Sunday, November 18, 2018

డైరీ చెప్పిన ప్రేమ కథ (కథ)


శేఖర్ కొత్తగా పెళ్లి అయ్యింది తను హైద్రాబాద్ లోని ఒక కంపెనీలో అకౌంటెంట్ గా 3 సంవత్సరాలు నుండి పనిచేస్తున్నాడు ఇప్పటివరకు బ్యాచిలర్ కాబట్టి హాస్టల్లో కలిసి ఉండేవాడు
కానీ తనకు పెళ్లి అయ్యింది తన భార్య కూడా తనతో ఉంటుంది కాబట్టి తన ఆఫీస్ కి దగ్గరలోనే ఒక ఇల్లు అద్దెకు తీసుకున్నాడు
శేఖర్, తన భార్య రమ్య తో కలిసి ఆ ఇంటిలోకి అద్దెకు వచ్చారు ఆ ఇల్లు చాలా అపరిశుభ్రంగా ఉంది దానిని శుభ్రం చేశారు
అంతా బాగానే ఉంది 2 రోజులు తరువాత పైన అటక మీద ఎదో శబ్దం వినబడుతుంది ఏమిటి అని శేఖర్ పైకి చూసాడు ఇంతలో పిల్లి కనిపించింది తనను చూసి పారిపోయింది
వెంటనే కిందికి దిగుదామని చూసాడు అంతలో అతనికి ఒక డైరీ కనిపించింది వెంటనే ఆ డైరీని తెరిచి చూసాడు
అందులో ఒక ఫోటో కనిపించింది ఆ ఫోటో ఎవరిదో కాదు తన స్నేహితుడు రమేష్
శేఖర్ కాసేపు అలానే ఉండిపోయాడు అసలు ఎక్కడో ఉన్న రమేష్ కి ఈ డైరీ కి సంబంధం ఏమిటి అని ఆలోచించాడు
వెంటనే డైరీ ఓపెన్ చేసి చూసాడు అందులో ఎవరో ఒక అమ్మాయి తను గురించి వివరిస్తూ రాసి ఉంది తన పేరు మల్లిక అని తనది గుంటూరు దగ్గర చిన్న గ్రామం అని తనకు పెళ్లి చేసి హైద్రాబాద్ పంపించారు అని చెప్పి తన తనను సరిగ్గా పట్టించుకోవటం లేదని ఆ డైరీ లో రాసి ఉంది
  ఐతే ఈ డైరీ కి ఈ ఫోటోకి సంబంధం ఏమిటి అని ఎంత ఆలోచించిన శేఖర్ కి అర్థం కాలేదు వెంటనే రమేష్ నెం ఫోన్ చేసాడు కానీ కలవటం లేదు

వెంటనే శేఖర్ తన ఊరు బయలుదేరాడు శేఖర్ ఆ ఊరిలో మొబైల్ షాప్ పెట్టుకుని జీవిస్తున్నాడు దూరం నుండి చూసిన వెంటనే రమేష్ శేఖర్ ని పలకరించాడు
కాసేపు మాట్లాడుకున్నారు
ఆ తరువాత శేఖర్ జరిగిన విషయాన్ని, ఆ డైరీ గురించి చెప్పాడు రమేష్ మల్లిక  స్నేనేహితులు గా ఉండేవాళ్ళం తరువాత ఆ స్నేహం ప్రేమగా మారింది ఆ విషయం ఆ అమ్మాయి కూడా చెప్పానని కానీ ఎటువంటి సమాధానం రాలేదని బాధపడ్డాను ఆ తరువాత మల్లిక ఎక్కడ కనిపించలేదని బాధపడుతూ చెప్పాడు
కొన్ని ప్రేమ కథలకు ముగింపు బాధతోనే మొదలవుతుంది !!!

Saturday, September 15, 2018

కిడ్నీలు పాడవటానికి కారణం కలుష్యమా ?


ఈ రోజుల్లో వాతావరణం కాలుష్యం మానవ మనుగడపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది అది మన చేతులరా మనమే చేసుకుంటున్నాం తాజాగా మనం తీసుకునే ఆహారంలో చాలా రసాయనిక చర్యలు జరిపి అవి మనం తీసుకుంటున్నాం దీన్ని వల్ల ముఖ్యంగా కిడ్నీ సంబంధిత వ్యాధులు బయట పడుతున్నాయి ఈ రోజుల్లో సాధారణంగా అందరికి కిడ్నీలో రాళ్లు ఏర్పడుతున్నాయి
 ఇవి ముఖ్యంగా మనం తినే ఆహారం వల్లే రాళ్లు ఏర్పడుతాయి మనం తినే ఆహారం కలుషితం అయితే దాని ప్రభావం ముందుగా కిడ్నీలు మీదే పడుతుంది  !!!

Monday, July 9, 2018

టెక్నాలజీ మనలో ఉన్న బద్దకాన్ని పెంచుతుందా ?



ఈ ప్రశ్నకు సమాధానం మనం రోజూ చేసే పనిలోనే మనకు అర్థం అవుతుంది ఇదివరకు పని చేయటానికి చాలా శ్రమ పడవలసి వచ్చేది కానీ నేడు ప్రతి పనికి టెక్నాలజీ పుణ్యమా అని మనిషి మరింత బద్దకాన్ని పెంచుతుంది
ఉదాహరణకు : బట్టలు ఇదివరకు చేతితో ఉతికేవారు కానీ నేడు వాషింగ్ మెషిన్ వాడుతున్నారు
                      పొయ్యి మీద వంట చేసే వారు నేడు గ్యాస్ స్టవ్, electrive స్టవ్ ఇలా చెప్పుకుంటా పోతే చాలానే ఉన్నాయి ఇవి మన శారీరక శ్రమను తగ్గించవచ్చు కానీ దీని వల్ల మనిషిలో ఉన్న బద్దకం మరింత పెరుగుతుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు


మనిషికి శారీరక శ్రమ లేకపోవటం వల్లనే త్వరగా అనారోగ్యాలు పాలు అవ్వటం అనేది జగమెరిగిన సత్యం టెక్నాలజీ తెచ్చిన సౌకర్యాలు వల్ల మనిషి మరింత బద్ధకంగా తయారు అవుతున్నాడు ఏదైనా కొనటానికి అయిన సరే మనిషి ఆన్లైన్ లో ఆర్డర్ చేస్తున్నాడు టెక్నాలజీ అభివృద్ధి చెందటంలో తప్పు లేదు కానీ ఆ టెక్నాలజీ తో వచ్చే సౌకర్యాలకు మానవుడు బాగా అలవాటు పడిపోతున్నాడు !!!

Sunday, July 8, 2018

తొలకరి చిరుజల్లు !!!


తొలకరి చిరుజల్లులో
మేను పులకరింపుగా
 సదా నీ పలకరింపుకి
ఎదురుచూస్తుంటుంది
             నా మది !!!

Tolakari chirujallulo
Menu palakarimpaga
Sada nee palakarimpuki
Eduruchustuntundi
       Naa madi !!!

Sunday, June 24, 2018

సెల్ ఫోన్ కింద పడి on అవ్వకపోతే ?



ఈ రోజుల్లో సెల్ ఫోన్ అనేది మానవ శరీర భాగాలలో ఒక భాగం అయింది అనే దానిలో ఎలాంటి అనుమానం లేదు మనం ఏ పనికైనా మొదట ఉపయోగించే వస్తువు ఏదైనా ఉందంటే అది ఒక్క సెల్ ఫోన్ మాత్రమే లెక్కలు నుండి చెల్లింపులు దాకా అన్ని కార్య కలపాలు సెల్ ఫోన్ ద్వారానే జరుగుతున్నాయి

సెల్ ఫోన్ లేనిదే ఈ ప్రపంచం ఆగి పోతుంది అన్నట్టుంది ప్రపంచం నేడు అయితే విషయమేమిటంటే పొరపాటునో గ్రహాపాటునో ఒక్కోసారి మొబైల్ చేజారి కిందికి పడిపోతుంది వెంటనే టచ్ మిగిలిపోతుంది ఒక్కోసారి మొబైల్ పడిన వెంటనే ఫోన్ on అవుతుంది ఒక్కోసారి ఫోన్ on అవ్వదు

ఫోన్ on అవ్వకపోతే మొదటగా మనం చేయాల్సింది :::

(1) కింద పడిన వెంటనే మొబైల్ fix చేసి ఛార్జింగ్ పెట్టాలి 15 నిమిషాలు
(2)  అప్పటికి on అవ్వకపోతే బ్యాటరీ రెండు చేతులతో rough చేయాలి ఇలా rough చేయటం వల్ల బ్యాటరీ లోకి ఉష్ణ శక్తి ఏర్పడి ఫోన్ on అయ్యే అవకాశం ఉంటుంది
(3) అప్పటికి ఫోన్ on అవ్వకపోతే బ్యాటరీ నాలుక చివరన పెట్టుకుంటే కొద్దిగా shock తగిలినట్టు ఉంటే బ్యాటరీ పరిస్థితి బాగానే ఉన్నట్టు
(4) అలా ఉండక పోతే బాటరీ discharge అయినట్టు
(5) ఒక వేళ బాటరీ discharge అయితే ఏదైనా మొబైల్ షాప్ లో బ్యాటరీ boosting  పెడితే బ్యాటరీ ఛార్జ్ అవుతుంది !!!

Saturday, June 23, 2018

మొబైల్ ఫోన్ బంధాలను విడదీస్తుందా ?


మొబైల్ ఫోన్ ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఈ చిన్న పరికరంలో దాగి ఉంది అంటే అతిశయోక్తి కాదు ఎందుకంటే మానవ మనుగడలో మొబైల్ ఫోన్ అంత ప్రముఖ పాత్రను నిర్వహిస్తుంది అయితే మొబైల్ ఫోన్ రావటం వల్ల ఎంత ప్రయోజనాలు ఉన్నాయో అంత దుష్ప్రభావం కూడా దాగి ఉంది

ప్రస్తుత పరిస్థితిలో purse లేకున్నా బయటకు వెళ్ళవచ్చు గాని మొబైల్ లేకుండా బయటకు వెళ్ల లేని పరిస్థితి ఏర్పడింది ఈ డిజిటల్ యుగంలో అంతా online లావాదేవీలు జరుగుతున్నాయి కాబట్టి బయటకు ఎక్కడకు వెళ్లిన ఫోన్ ద్వారా చెల్లింపులు జరపటం జరుగుతుంది

ప్రజలు కూడా మనీ carry చేయటానికటే మొబైల్ ద్వారానే చెల్లింపులు జరుపుతున్నారు online లావాదేవీలు వచ్చినప్పటి నుండి పని ఎంత సులువుగా అవుతుందో అంతే ఎక్కువుగా మోసాలు జరుగుతున్నాయి
అయితే ఈ మధ్య కాలంలో online మోసాలు కొద్దిగా తగ్గినట్టే అనిపిస్తున్నాయి  మొబైల్ ఫోన్ వ్యాపార పరంగా కాకుండా మానవ సంబంధాలు కూడా దెబ్బ తింటున్నాయి ఇదివరలో landline వాడే కాలంలో ఖచ్చితంగా ఎక్కడ ఉన్నారనేది తెలిసిపోయేది కానీ ఇప్పుడు మొబైల్ ఫోన్ వచ్చిన తరువాత అబద్దాలు ఎక్కువ అవుతున్నాయి
అంతే కాకుండా సామాజిక మాధ్యమాలు ద్వారా కూడా అసత్య ప్రచారాలు, వ్యక్తిగత మనోభావాలు దెబ్బతినే విధంగా తయారయ్యాయి మొబైల్ ఫోన్ ద్వారా మనుషులు దూరంగా ఉన్నవారిని దగ్గర చేయటం అటుంచి అసలు మానవ సంబంధాలు దెబ్బ తీస్తున్నాయి 

ఈ మధ్య కాలంలో చిన్న పిల్లలకు కూడా ఫోన్ పెద్దవాళ్ళు ఫోన్ అలవాటు చేస్తున్నారు దీనివల్ల వారి శారీరక అభివృద్ధి పై సన్నగిల్లుతుంది !!!
మనిషి మీద మనిషికి నమ్మకం తగ్గుతుంది ఈ ఫోన్ వల్లే అనటం లో ఎలాంటి సందేహం లేదు

Friday, June 22, 2018

ఉదయం బ్రేక్ ఫాస్ట్ ( టిఫిన్) మానకూడదు ఎందుకంటే ?


మనం రోజంతా ఉత్సాహంగా ఉండడానికి బ్రేక్ ఫాస్ట్ తప్పనిసరిగా తీసుకోవాలి బ్రేక్ ఫాస్ట్ అనేది మనం రాత్రి విశ్రాంతి తీసుకున్న తరువాత మనలో శక్తిని తిరిగి పొందడానికి బ్రేక్ ఫాస్ట్ చేయాలి అలా క్రమం తప్పకుండా తీసువటం మన ఆరోగ్యానికి చాలా మంచిది

ఉదయం బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోవటం వల్ల కలిగే దుష్పరిణామలు :::

(1) క్రమంగా బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోతే మనకు మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువుగా ఉంటాయి
(2) అంతే కాకుండా ఊబకాయం వచ్చే అవకాశాలు ఎక్కువుగా ఉంటాయి
(3)  ఆ రోజంతా నిరుత్సాహంగా ఉంటారు
(4) ఎసిడిటీ వచ్చే అవకాశం ఉంది
(5) వయసు రాకుండా వచ్చే అన్ని రోగాలకు మొదటి కారణం బ్రేక్ ఫాస్ట్ చేయకపోవడం వల్లే


బ్రేక్ ఫాస్ట్ అంటే ఏది పడితే అది తిన కూడదు నూనె పదార్దాలు తినకుండా ఉంటేనే మంచిది మన పెద్దలలో చాలామంది ఇప్పటికి ఏ అనారోగ్యం రాకుండా ఉంటారు దానికి కారణం వారు తినే తిండి వారు ఎక్కువుగా మంచి మంచి ఆహారపు అలవాట్లు పాటించారు కాబట్టి వారు ఆరోగ్యం గానే ఉంటారు

కాక పోతే తీసుకునే ఆహారం చాలా తక్కువ మోతాదులో తీసుకోవటం మంచిది !!!

Ear phones తో జర భద్రం !!!



టెక్నాలజీ అన్నది ఎంతగా అభివృద్ధి చెందుతుందో అంతే ఎక్కువగా ప్రమాదాలను కొని తెచుకుంటున్నట్టుంది పరిస్థితి మనం సాధారణంగా మొబైల్ వాడేటప్పుడు పాటలు వినటం కోసం ear phones వాడటం జరుగుతుంది
Ear phones వాడటం మంచిదే కానీ అతిగా వాడటం మంచిది కాదు ear phonesలో కొద్దీ సేపు మాత్రమే  పాటలు వినాలి అంతే కదా అని ఎక్కువ సార్లు అదే పనిగా వాడటం వల్ల వినికిడి సమస్యలు తలెత్తుతాయి
ఫోన్ ఎక్కువ సేపు మాట్లాడేవారికి ear phones వాడటం ఎంతో మంచిది మొబైల్ నుండి వెలువడే రేడియేషన్ తగ్గించటానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది


Ear phones లో పాటలు తక్కువ valume తో వినటం మంచిది ట్రాఫిలో ear phones అసలు వాడకూడదు
బైక్ మీద  ear phones లో వాడటం అంత మంచిది కాదు.
అంతే కాకుండా మొబైల్ తో పాటు వచ్చే ear phones కాకుండా వేరే ear phones వాడటం వల్ల మీకు అసౌకర్యంగా ఉంటుంది మొబైల్ లో కూడా సమస్యలు తల ఎత్తే అవకాశం ఎక్కువుగా ఉంటుంది ear phones తో ఎక్కవ సేపు పాటలు వినడం ద్వారా తల నొప్పి వచ్చే అవకాశం ఎక్కువుగా ఉంటుంది

Ear phones వాడండి కానీ అవసరం కొరకే వాడండి మొబైల్ కొన్న వెంటనే  ఆ బాక్స్ లో అన్ని accessaries  సరిగా ఉన్నాయో లేదో చూసుకుంటాం కానీ user mannual ఎవరు చదవరు ఆ manual చదివితే ఆ ఫోన్ ఎలా వాడాలో ఏ accassaries ఎలా వాడాలో తెలుస్తుంది !!!

పైన పేర్కొంబడిన విషయాలు మీకు తెలిస్తే పర్వాలేదు కానీ తెలియని వారు ఉంటే వారికి తెలియచేయటనికి !!!


వినయ విధేయ రామలోని లిరికల్ వీడియో సాంగ్ !!!

రంగ స్థలం తరువాత రాంచరణ్ నటిస్తున్న బోయపాటి డైరెక్షన్ లో వస్తున్న వినయ విధేయ రామ లోని లిరికల్ వీడియో సాంగ్ విడుదల చేసారు !!!