Tuesday, November 20, 2018

ఎవరు (కథ )


ఉదయం సమయం 7 గంటలు అవుతుంది ఫోన్ మోగుతుంది కాసేపటికి ఫోన్ అందుకున్నాడు ప్రకాష్ రేపు మా ఇంటిలో ఫంక్షన్ ఉంది తన ఫ్రెండ్ సుందరం  రమ్మని వారం రోజులుగా చెబుతున్నాడు మరొకసారి గుర్తు చేద్దామని ఫోన్ చేసాడు సరే వస్తాను అని చెప్పాడు
    కొంచెం త్వరగా బయలుదేరి రా రాత్రి పూట ప్రయాణం మా ఊరిలోఎమి దొరకవు అని చెప్పాడు వెంటనే లేచి స్నానం చేసి తన షాప్ కి తాను వెళ్ళాడు ప్రకాష్ ఒక మొబైల్ షాప్ లో మెకానిక్ గా పని చేస్తున్నాడు సాయంత్రం 6 గంటలు అవుతుంది తన షాపులో పెర్మిషన్ తీసుకొని ఇంటికి వెళ్లి స్నానం చేసి బయలుదేరాడు
  తన ఫ్రెండ్ సుందరం ఇంటికి ఎప్పుడో ఒకసారి వెళ్ళాడు ప్రకాష్ వెళ్లి 5 సంవత్సరాలు పైనే అవుతుంది అది బాగా పల్లెటూరు సాయంత్రం 8 గంటలకి అందరూ పడుకుంటారు అంతా చీకటిగానే  ఉంది  మెల్లగా తన బైకుపై వెళ్తున్నాడు ఇంతలో ఎవరో  పిలిచినట్టు ఒక కేక వినిపించింది వెంటనే బైక్ అపి వెనకకు తిరిగి చూసాడు ఎవరు కనిపించలేదు మరలా బైక్ స్టార్ట్ చేసి ముందుకు వెళ్తున్నాడు
ఈ సారి తన బైక్ ఆగిపోయింది చుట్టూ చూసాడు కనీసం కనుచూపు మేరలో ఎవరు కనిపించలేదు వెంటనే తన ఫ్రెండ్ సుందరంకి ఫోన్ చేసాడు  చాలా సేపు కలవలేదు కాసేపటికి కలిసింది సరే ఇప్పుడు నువ్వు ఎక్కడఉన్నావు అని అడిగాడు సుందరం
నేను వేట్ల దాటిన తరువాత కొంచెం దూరం లో ఉన్నాను అని చెప్పాడు సరే నేను వస్తున్నాని ఫోన్ పెట్టేసాడు

కాసేపటికి అక్కడకి చేరుకున్నాడు కానీ అక్కడ ప్రకాష్ లేడు తన బైక్ మాత్రం ఉంది చుట్టూ చూసాడు ఎక్కడ కనిపించలేదు తన మొబైల్ కి ఫోన్ చేసాడు ఎక్కాడు దూరంగా చెట్టు పొదలలో వినబడుతుంది ఆ పక్కనే పది ఉన్నాడు ప్రకాష్
వెంటనే దగ్గరలోని హాస్పిటల్ కి తీసుకెళ్లాడు సుందరం కాసేపటికి మెలకువ లోకి వచ్చాడు ప్రకాష్
ఏమి జరిగింది అని అడిగాడు సుందరం
నేను నీకు ఫోన్ చేసిన తరువాత కొద్దీ సేపటికి ఎవరో కారు మీద వచ్చారు నేను ఆపడానికి ప్రయత్నించాను కానీ ఆ కారు ఆపలేదు కొంచెం దూరంలో ఆ కారు ఆగింది అంతలో నేను కారు దగ్గరికి వెళ్ళాను ఎవరినో బలవంతంగా తీసుకెళ్తున్నారు నేను వెంటనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను అంతలో ఎవరో నన్ను బలవంతంగా వెనుక నుండి కొట్టారు నేను స్పృహ తప్పి పడిపోయాను ఇది జరిగింది వెంటనే పోలీస్ లకి ఫోన్ చేసి జరిగింది అంతా చెప్పారు !!!

ఒంటరితనాన్ని ఓడించలేమా?


ఒక మనిషి ఒంటరితనాన్ని కోరుకుంటున్నాడంటే
 అతను ఎవరికి చెప్పుకొని బాధలోనైన, భయంతోనైన అయ్యి ఉండాలి
బాధను తీర్చలేము దానికి సమయమే సమాధానం చెబుతుంది
అదే భయం అయితే నలుగురితో కలిస్తేనే, కలివిడిగా ఉంటేనే భయం పోతుంది
ఒంటరితనం అనేది తాత్కాలికంగా ఉపశమనం పొందవచ్చు కానీ అదే అలవాటుగా మరితే మాత్రం జీవితమే కోల్పోవాల్సి ఉంటుంది !!!

Sunday, November 18, 2018

డైరీ చెప్పిన ప్రేమ కథ (కథ)


శేఖర్ కొత్తగా పెళ్లి అయ్యింది తను హైద్రాబాద్ లోని ఒక కంపెనీలో అకౌంటెంట్ గా 3 సంవత్సరాలు నుండి పనిచేస్తున్నాడు ఇప్పటివరకు బ్యాచిలర్ కాబట్టి హాస్టల్లో కలిసి ఉండేవాడు
కానీ తనకు పెళ్లి అయ్యింది తన భార్య కూడా తనతో ఉంటుంది కాబట్టి తన ఆఫీస్ కి దగ్గరలోనే ఒక ఇల్లు అద్దెకు తీసుకున్నాడు
శేఖర్, తన భార్య రమ్య తో కలిసి ఆ ఇంటిలోకి అద్దెకు వచ్చారు ఆ ఇల్లు చాలా అపరిశుభ్రంగా ఉంది దానిని శుభ్రం చేశారు
అంతా బాగానే ఉంది 2 రోజులు తరువాత పైన అటక మీద ఎదో శబ్దం వినబడుతుంది ఏమిటి అని శేఖర్ పైకి చూసాడు ఇంతలో పిల్లి కనిపించింది తనను చూసి పారిపోయింది
వెంటనే కిందికి దిగుదామని చూసాడు అంతలో అతనికి ఒక డైరీ కనిపించింది వెంటనే ఆ డైరీని తెరిచి చూసాడు
అందులో ఒక ఫోటో కనిపించింది ఆ ఫోటో ఎవరిదో కాదు తన స్నేహితుడు రమేష్
శేఖర్ కాసేపు అలానే ఉండిపోయాడు అసలు ఎక్కడో ఉన్న రమేష్ కి ఈ డైరీ కి సంబంధం ఏమిటి అని ఆలోచించాడు
వెంటనే డైరీ ఓపెన్ చేసి చూసాడు అందులో ఎవరో ఒక అమ్మాయి తను గురించి వివరిస్తూ రాసి ఉంది తన పేరు మల్లిక అని తనది గుంటూరు దగ్గర చిన్న గ్రామం అని తనకు పెళ్లి చేసి హైద్రాబాద్ పంపించారు అని చెప్పి తన తనను సరిగ్గా పట్టించుకోవటం లేదని ఆ డైరీ లో రాసి ఉంది
  ఐతే ఈ డైరీ కి ఈ ఫోటోకి సంబంధం ఏమిటి అని ఎంత ఆలోచించిన శేఖర్ కి అర్థం కాలేదు వెంటనే రమేష్ నెం ఫోన్ చేసాడు కానీ కలవటం లేదు

వెంటనే శేఖర్ తన ఊరు బయలుదేరాడు శేఖర్ ఆ ఊరిలో మొబైల్ షాప్ పెట్టుకుని జీవిస్తున్నాడు దూరం నుండి చూసిన వెంటనే రమేష్ శేఖర్ ని పలకరించాడు
కాసేపు మాట్లాడుకున్నారు
ఆ తరువాత శేఖర్ జరిగిన విషయాన్ని, ఆ డైరీ గురించి చెప్పాడు రమేష్ మల్లిక  స్నేనేహితులు గా ఉండేవాళ్ళం తరువాత ఆ స్నేహం ప్రేమగా మారింది ఆ విషయం ఆ అమ్మాయి కూడా చెప్పానని కానీ ఎటువంటి సమాధానం రాలేదని బాధపడ్డాను ఆ తరువాత మల్లిక ఎక్కడ కనిపించలేదని బాధపడుతూ చెప్పాడు
కొన్ని ప్రేమ కథలకు ముగింపు బాధతోనే మొదలవుతుంది !!!

Saturday, November 17, 2018

భయం !!!


భయం చాలా విచిత్రమైనది ఎందుకంటే
మనిషికి బ్రతుకుమీద ఆశ పుట్టించేది భయం
బ్రతుకు మీద విరక్తి పుట్టించేది భయం
  భయపడుతూ బ్రతికేవాడు ప్రతి పనిలోనూ భయమే కనపడుతుంది
భయం మనలోని బలహీనతని ఇతరులకు తెలిసేలా చేస్తుంది
భయం మన వ్యక్తిత్వాన్ని బయటపడుతుంది !!!


Friday, November 2, 2018

నిరీక్షణ (కవిత)

నిద్ర రాని కళ్ళతో నీ కోసం నిరీక్షణ
 మరువలేని మనసుతో నీ కోసం నిరీక్షణ
    అంతులేని ఆశతో నీకోసం నిరీక్షణ
         నువ్వొస్తావని నా నిరీక్షణ !!!

Thursday, November 1, 2018

దీపావళి అంటే (నా భావన )

దీపావళి అంటే చీకటిలో వెలుగు కాదు
               చెడు పై మంచి గెలుపు
దీపావళి అంటే పండగ మాత్రమే కాదు
      ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిన పాఠం కూడా ఉంది
దీపావళి అంటే టపాసులు కాల్చడం మాత్రమే కాదు
       మనలో ఉన్న అసూయ, ద్వేషం, కోపం, ఆవేశం అనే                    వాటిని  కాల్చటం !!!

ఎవరు (కథ )

ఉదయం సమయం 7 గంటలు అవుతుంది ఫోన్ మోగుతుంది కాసేపటికి ఫోన్ అందుకున్నాడు ప్రకాష్ రేపు మా ఇంటిలో ఫంక్షన్ ఉంది తన ఫ్రెండ్ సుందరం  రమ్మని వారం...